అనారోగ్యంతో బాధపడుతున్న దర్శి నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదివారం ఒంగోలులో అందజేశారు. కట్టెకోట పద్మకు రూ.3.40 లక్షలు, నంబూరి అబ్సలోముకు రూ.3.50 లక్షలు, పాశం వెంకటలక్ష్మికి రూ.6.20 లక్షలు, మొదుల్ల వెం కట సుబ్బారెడ్డికి రూ.6.50 లక్షలు అంజేశారు. ఈసం దర్భంగా వారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టికి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా ,గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సం క్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు కట్టెకోట హరీష్, జేసీఎస్ కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా, కౌన్సిలర్ వీసీరెడ్డి,పాశం జయసింహారావు, నారాయణ పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లిగ్రామానికి చెందిన మొదుళ్ల వెంకటసుబ్బారెడ్డికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆరు లక్షల యాభై వేల రూపాయల చెక్కును ఆదివారం పం పిణీ చేశారు. అనారోగ్యంతో బాధ పడుతుండంతో వైద్య ఖర్చులకు గాను చెక్కును అందజేశారు. ఈసందర్భంగా ఒంగోలు లోని ఎమ్మెల్యే కార్యా కార్యా లయంలో చెక్కును వెంకట సుబ్బారెడ్డికి అందజే శారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి జగనన్న పేదల పక్షాన నిలబడి సకా లంలో సహాయం చేయడం పట్ల సుబ్బారెడ్డి సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి, నాయకులు అన్నపు రెడ్డి భిక్షాలురెడ్డి, వెంకంబొట్లు పాల్గొన్నారు.



