కురిచేడు మండలంలోని పొట్లపాడు, కురిచేడు-2, కల్లూరు గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం ప్రారంభించారు. పొట్లపాడు సచివాలయం, రైతు భరోసా, కల్లూరు గ్రామంలోని గ్రామ సచివాలయం, రైతు భరోసాతో పాటు కురిచేడు-2 పరిధిలోని గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ను ఆయన ప్రారంభిం చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన గ్రామ స్వరాజ్యంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి సిబ్బందిని గ్రామాలకు పంపి ప్రజలకు అందుబాటులో సేవలు అంది స్తున్నారన్నారు. ఆయన వెంట జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, ఎంపీపీ బెల్లం కోటేశ్వ రమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనరు వైవీ సుబ్బయ్య, పడమర గంగవరం, కల్లూరు, పడ మరకాశీపురం, కురిచేడు సర్పంచ్ లు కాసు భాస్కర రెడ్డి, నక్కా రామకృష్ణ, సాదం రాజేశ్వరి, కేసనపల్లి కృష్ణయ్య, ఎంపీటీసీలు బుల్లం వెంకట నర్సయ్య, ఎన్ఎస్పీ అగ్రహారం, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ లు ఆరె శ్రీనివాసరావు, పోతిరెడ్డి నాగిరెడ్డి, జేసీఎస్ కన్వీనరు మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాశయ్య, మాజీ జెడ్పీటీసీ వరికూటి వెంకటేశ్వర్లు, నాయకులు ఆవుల వెంకటరెడ్డి, మిల్లర్ బుజ్జి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, బెల్లం చం ద్రశేఖర్, నారాయణరెడ్డి, వడ్డె మాలకొండయ్య, షేక్ మస్తాన్ వలి , ఏపీ సాంబయ్య, మారెల్ల కాశీ చెన్నకేశవులు, మారెళ్ల రామాంజనేయులు, వేమా ఆంజనేయులు, చౌడయ్య, పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సాదం నాసరయ్య పాల్గొన్నారు.


