మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తయారు చేసి త్వరిత గతిన ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో కోరారు.
మిచౌంగ్ తుఫాను కారణంగా ప్రకాశం జిల్లా లో కురిసిన భారీ వర్షాలకు చేతికి అందిన వరి పంటలు, మొక్కజొన్న , పొగాకు , కంది , సజ్జ ,వేరుశనగ, అలసంద ,పెసర , అరటి తోటలు, కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.పొలాలలోని వరి ధాన్యపురాసులు వర్షానికి తడిచి మొలకలు వచ్చాయి. కొన్ని ధాన్యపు రాసులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. రైతులు కష్టపడి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మిచౌంగ్
తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైయ్యాయి . ఆరుగారం శ్రమించి లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటలు జలమయ్యాయి. కల్లాలలో ఉన్న ధాన్యం తడిచి రంగుమారగా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి ముందుకు రాకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకోవలసిన దుస్థితి నెలకొంది.. మరోవైపు పొలంలో ఉన్న కోతకొచ్చిన పైరు నీటిలో మునిగి మొలకలెత్తిన స్థితిలో రైతులు పంట కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు..
ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాలలో వరి, పత్తి ,మిరప,అరటి,
పసుపు, ఉద్యాన పంటలు మరియు కూరగాయ తోటలకు మిచౌంగ్ తుఫాను కారణంగా దాదాపు 8000 కోట్ల తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి కానీ రాష్ట్ర ప్రభత్వం తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటోంది. రైతు ను ఆదుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయ్యింది.. మన జిల్లాలో వరి, పత్తి, మిరప, అపరాలు, మొక్కజొన్న, అరటి పంటల రైతులు పూర్తిగా నష్టపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నేటికీ పంటనష్టం అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆదుకోవడానికి ఈక్రింది తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం
🔸జిల్లాలో పంటనష్టం అంచనాలు అధికారులు తక్షణం పూర్తిచేయాలి
🔸పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు వరికి రూ.50వేలు, మొక్కజొన్న, అపరాలు కి రూ.30వేలు, పత్తికిరూ.40వేలు,మిరప,
అరటి, పసుపుకు రూ.60వేలు, కూరగాయలకు రూ.25వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము..
🔸తడిచిన మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఏస్థితిలో ఉన్నా తప్పక మద్దతు ధరకు తగ్గకుండా రైతుల నుండి కొనుగోలు చేయాలని, తుఫాను బాధిత రైతులందరినీ ఆదుకోవాలి
🔸రైతులందరికీ పంటలబీమా వర్తింప చేయాలి.
🔸రబీ సాగుకు ఉచితంగా ఎరువులు,విత్తనాలు అందించాలి.
🔸తుఫానుతో నష్టపోయిన రైతులకు పంట రుణాలను మాఫీ చేసి తిరిగి రుణాలను అందించాలి..
🔸కాల్వలు ఆధునీకరణ పనులు తక్షణమే చేపట్టాలి.
🔸ధాన్యం కొనుగోలల్లో విధించిన నిబంధనలను రైతులకు అనుగుణంగా మార్చి న్యాయం చేయాలి.
🔸తుఫాను ప్రభావంతో చేపల,రొయ్యల రైతలను కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.
ఈ యొక్క కార్యక్రమం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి, బాపట్ల జిల్లా ఇన్చార్జి క్రిష్ణా రెడ్డి, కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి, పార్లమెంటు కన్వినర్ సిగ్గెం శ్రీనివాసరావు, అసెంబ్లీ కన్వినర్ యోగయ్యయాదవ్, పొగాకు బోర్డు మెంబర్స్ పాద వర ప్రసాద్, బోడపాటి బ్రహ్మయ్య, తనికొండ సురేష్, కోటేశ్వరి. క్రిష్ణవేణిలు పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ ఆర్ శ్రీలతకు పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

