ప్రజలు ఈ నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ నరెడ్డికి పట్టం కట్టాలని దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కోరారు. దర్శి మండలంలోని రామచంద్రపురంలో బుధవారం జరిగిన ” జగనే ఎందుకు ఏపీకి” అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత పార్టీ పతా కాన్ని, అభివృద్ధి బోర్డును ఆవిష్కరించారు. రాష్ట్రం లో ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశ పెట్టి వాటిని అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహనరెడ్డిదేనన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేశార న్నారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అర్హతే
ప్రామాణికంగా కుల, మత, పార్టీ, వర్గ రహితంగా పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఒక్కడే అని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, స్థానిక నాయకులు బాదం చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంటనష్టం జరిగిన రైతులకు మేలు చేయండి- ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
మిచాంగ్ తుఫాను కారణంగా పంటనష్టపో యిన ప్రతి రైతుకు మేలు చేయాలని అదికారులను దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో బుధ వారం ఆయన నియోజకర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టం జరిగిన పంటలను పరిశీలించి నమోదు చేయాలని ఆయన సూచిం చారు. ఏ ఒక్క రైతు నష్టపోయి న్యాయం జరగ లేదని బాధపడకూడదన్నారు. కష్టపడి పనిచేసుకునే రైతులకు న్యాయం చేయటం అందరి బాధ్యతని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టిని కలిసిన ఈఈ పూర్ణచంద్రరావు
నూతనంగా ఎన్ఎస్పీ డివిజన్ కి వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పూర్ణచంద్రరావు బుధవారం దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను మర్యాదపూర్వ కంగా కలిశారు. మద్దిశెట్టి వేణుగోపాల్ నివాసం లో ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా ఉన్నారు.




