కేజీబీవీలో చదువుతున్న బాలికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నాణ్యమైన భోజనం పెట్ట లేకపోతే రాజీనామా చేసి వెళ్లాలని ప్రిన్సి పాల్ సుజితను రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు జి.దేవి ఆదేశించారు. తాళ్లూరు పీహెచ్సీతోపాటు బీసీ బాలికల, ఎస్సీ బాలుర, కేజీబీవీ విద్యాలయాలను బుధ వారం సాయంత్రం ఆమె సందర్శించారు. కేజీబీవీలో బాలికలతో నేరుగా మాట్లాడి వారితో చీటీల ద్వారా విద్యాల యంలో భోజన పరంగా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటిలో పురుగులు వస్తున్నాయని, భోజనం ఉడికి, ఉడకనట్లుగా ఉంటుందని విద్యార్థులు తమ అభిప్రాయాలను చీటీల్లో వెల్లడించారు. అనంతరం ఆమె స్టోర్ రూమ్ ను పరిశీలించారు. నిత్యావసర వస్తువులు చిందరవందరంగా ఉండి దుర్వాసనగా వస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు సాయంత్రం వేళ ఇచ్చేందుకు తయారు చేసిన బఠానీ గుగ్గిళ్లను పరిశీలించారు. వాటిల్లో పోపులు కన్పించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం బెండకాయకూర, సాంబారు కాదని ఆకుకూర పప్పు చేయటం తగదన్నారు. ప్రిన్సిపల్ తెమ్మన్న కూరలనే తెచ్చి వంట చేస్తున్నామని, సక్రమంగా సరుకులు అందజేస్తే నాణ్య మైన భోజనం తయారు చేయటానికి ఇబ్బంది ఉండదని వంటవారు ఆమెకు విన్నవించారు. కేజీబీవీ నిర్వహణ సక్రమంగా లేనందున నోటీస్ ఇస్తున్నామని సంజాయిషి ఇవ్వాలని ప్రిన్సిపాల్ కి సూచించారు. ముందుగా స్థానిక పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి అందుతున్న పలు సేవలను అడిగి తెలుసుకున్నారు . అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తీ ఎలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈకార్య క్రమంలో డీఎస్వో ఏ.ఉదయభాస్కర్, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య, సోషల్ వెల్ఫేర్ దర్శి ఎస్ డబ్ల్యూవో రబియామేగం, వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బీ, ఎంపీడీవో కె.యుగకీర్తి, తహసీల్దార్ ప్రసాద్, ఎంఈవో జి.సుబ్బయ్య, విజిలెన్సు అధికారులు పాల్గొన్నారు.






