ప్రధాని విశ్వకర్మ యోజన పథకమును విస్త్రుత ప్రచారం చేస్తున్న భాజపా మహిళామోర్చా నాయకులు – పలువురిచే ధరఖాస్తు చేయించారు.

ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 18 రకాల కులవృత్తుల వారికి ఉపయోగకరంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం ద్వారా వారి కుటుంబ పోషణ వ్యాపార అభివృద్ధికై అతి తక్కువ వడ్డీ కి తొలి విడతలో లక్ష రూపాయలు దాకా ఋణాలు మంజూరు చేయడం జరుగుతుందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రజలకు చేరేలా కృషి చేయడం లేదని, కానీ బిజేపి నాయకులు లబ్ధిదారులను గుర్తించి పలువురిచే ధరఖాస్తు చేయిస్తున్నారని స్థానిక కోర్టు సెంటరు విఘ్నేశ్వరా బుక్ షాప్ మరియు ఆన్లైన్ సెంటరు నిర్వాహకులు కటకం మహేష్ (బాబి) తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బుధవారం భాజపా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి మరియు జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, జిల్లా ఉపాధ్యక్షురాలు జాజ్జర కృష్ణవేణి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ తిరుమల మరియు ధనిశెట్టి పావని ఆధ్వర్యములో పదిమంది లబ్ధిదారులచే ప్రధాని విశ్వకర్మ యోజన కు ధరఖాస్తు చేయించారు.

ఈ సందర్భంగా తీగల సత్యవతి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ మహిళ మృతి ఆధ్వర్యంలో విశేషమైన కృషి చేస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక బిజెపి మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని ఈ పథకం గురించి ప్రతి ఒక్కరికి వివరించి దరఖాస్తు చేయిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *