వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను మరింత చేరువ చేసేందుకు క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది మరింత కృషి చెయ్యాలని డిటిసీఓ డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిటిసీఓ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారు ఎదైనా అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు ఉచిత వైద్యం పొందటం పై అవగాహన కల్పించారు. 104 కాల్ సెంటర్ ద్వారా, విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా, 108 అబులెన్స్ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా చికిత్స పొందు విధానంపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ .. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా వైద్య సహాయం పొందే విధానంను వివరించారు. యాప్ ను ఆరోగ్య కార్యకర్తలు విస్తృతంగా గ్రామాలలోనికి తీసుకువెళ్లి నమోదు చేయించాలని చెప్పారు. డిశంబర్ 18 నుండి మండలంలో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రెండు బృందాలుగా ఏర్పడి కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్డులు పంపిణీ చేసి కైవైసీ వాలంటీర్ యాప్లో లో నమోదు చెయ్యాలని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య , వైద్యులు డాక్టర్ రాజేష్, సీహెచ్, ప్రమీల, హెచ్ఎస్ రవికుమార్, హెచ్.వి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


