వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీలకు వివిధ హోదాల్లో నియామకం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దర్శి నియోజకవర్గం లోని పలువురికి ఈ అనుబంధ కమిటీల్లో స్థానం దక్కింది. బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీగా కుంచాల పెద్ద నాగరాజు, కార్యదర్శులుగా కండె గం గయ్య, బరిగల శ్రీను, జాయింట్ సెక్రటరీలుగా అన్నవరపు రవి, చేకూరి జగన్లను నియమిం చారు. జిల్లా మహిళా విభాగం కమిటీలో జనరల్ సెక్రటరీగా వజ్జా నాగమణి, సెక్రటరీలుగా మేడిశెట్టి నాగమణి, ఇంటూరి పద్మ, జాయింట్ సెక్రటరీలుగా కందిమళ్ల గీతాంజలి, పసుపులేటి వెంకాయమ్మలను నియమించారు. జిల్లా మైనార్టీ సెల్ కమిటీలో జనరల్ సెక్రటరీగా షేక్ అమీన్ బాషా, సెక్రటరీలుగా షేక్ బాజీ, షేక్ నాయభ్ర సూల్, జాయింట్ సెక్రటరీలుగా షేక్ లాలు సాహెబ్, షేక్ కరిముల్లాను నియమించారు. జిల్లా
పంచాయతీరాజ్ వింగ్ కమిటీలో వైస్ ప్రెసిడెం టుగా వరికూటి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీగా మొదుళ్ల వెంకట సుబ్బారెడ్డి, సెక్రటరీగా భద్రి వెం కట సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా మాది రెడ్డి రామకృష్ణారెడ్డి, పోలెబోయిన పెద్ద పెద్దయ్య లను నియమించారు. జిల్లా పబ్లిసిటీ వింగ్ కమిటీలో జనరల్ సెక్రటరీగా కోరె చిన్న సుబ్బా రావు, సెక్రటరీలుగా దామర్ల చంద్రమౌళి, బొ మ్మినేని అంకబాబు, జాయింట్ సెక్రటరీలుగా మూడమంచు చిన్న యల్లయ్య, గుజ్జుల వెంకటేశ్వ రరెడ్డిలను నియమించారు. జిల్లా ఎస్సీ సెల్ కమి టీలో ప్రెసిడెంటుగా గాలిమూటి దేవప్రసాద్, జన రల్ సెక్రటరీగా గుంటు పోలయ్య. సెక్రటరీలుగా కుంట అచ్చారావు, చిల్లా సుశీల ప్రతాప్, జాయిం ట్ సెక్రటరీలుగా కొడవటి జాన్, గోల్లపాటి అచ్చయ్యలను నియమించారు. జిల్లా స్టూడెంట్ వింగ్ కమిటీలో జనరల్ సెక్రటరీగా జోసఫ్, సెక్రట రీలుగా కొరివి చిన్న కోటేశ్వరరావు, పి. యలమం దారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా మొదుళ్ల శ్రీనివా సరెడ్డి, కొర్రపాటి విష్ణులను నియమించారు. జిల్లావాణిజ్య విభాగం కమిటీలో జనరల్ సెక్రటరీగా సానికొమ్ము తిరుపతిరెడ్డి, సెక్రటరీలుగా తెలగం శెట్టి చంద్రశేఖర్, తెల్ల ఇంద్రసేనారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా బొమ్మనబోయిన చిన్న వెంకయ్య, ధర్మ వాసుదేవరెడ్డిలను నియమించారు. జిల్లా వికలాంగుల విభాగం కమిటీలో వైస్ ప్రెసిడెం టుగా దగ్గుల బ్రహ్మానందరెడ్డి, జనరల్ సెక్రటరీగా మురికిపుడి వెంకటయ్య, సెక్రటరీలుగా వెన్నపూస సుబ్బారెడ్డి, బెజవాడ కరుణాకర్, జాయింట్ సెక్రటరీలుగా నూనె ప్రసన్న, రెడ్డిమాసు శ్రీరామ మూర్తిలను నియమించారు. జిల్లా వీవర్స్ వింగ్ కమిటీలో సెక్రటరీలుగా పులిపాటి శింగరకొండ, అనుముల వెంకటేశ్వర్లు, దొంతు వెంకటేశ్వర్లును నియమించారు. జిల్లా యూత్ వింగ్ కమిటీలో ప్రెసిడెంట్గా గొంగటి శ్రీకాంత్రెడ్డి, జనరల్ సెక్ర టరీగా భీమిరెడ్డి నాగ మల్లేశ్వరరెడ్డి, సెక్రటరీలుగా గర్నెపూడి ప్రసన్నకుమార్, నలదిమ్ము యోగిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా సయ్యద్ గఫార్, గుంటు అజయ్ కుమార్ ను నియమించినట్లు కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది.
దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల నియామకం
16
Dec