న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి టీ రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాల్గోరోజు శుక్రవారం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని అంగన్ వాడీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాం ధీ, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రా లను సమ ర్పించారు. సమస్యలను పట్టించుకోకుం డా ప్రభుత్వం కేంద్రాలను బలవంతంగా స్వా ధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకూ ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు సంఘం, ఉపాధ్యాయ సంఘాలు, అంగన్వాడీ నాయకులు బోడపాటి హనుమంతరావు, సందు వెంకటేశ్వరరావు, నారాయణ, షేక్ కాలేబాషా, బాపిరెడ్డి, అచ్చమాంబ, అంజమ్మ, సుజా త, విజయరాణి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కార్య కర్తల ఆందోళనకు యూటీఎఫ్ అధ్యక్షుడు మీనుగ శ్రీనివాసరావు మద్దతు ప్రకటించారు.



