ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 ఆక్వాకల్చర్ డవలప్ మెంట్ అధారిటీని ఏర్పాటు చేసి విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులకు ఊపిరి పోసారని ఆంద్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డవలప్మెంట్ ఆధారిటి (అప్సడా) రాష్ట్ర వైస్ చైర్మన్ వి. రఘరామ్ అన్నారు. ఒంగోలులో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శనివారం రోయ్యల రైతుల సదస్సు నిర్వహించారు. రోయ్యల రైతుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్సడా రాష్ట్ర చైర్మన్ వి. రఘరామ్ మాట్లాడుతూ… సీఎం వైస్ జగన్ విద్యుత్ సబ్సిడీ ఇవ్వటం వలనే ఇబ్బందులలో ఉన్న ఆక్వా మరలా సాగుకు సాధ్యమైనదని చెప్పారు. ఆక్వా రంగానికి రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రూపంలో 2800 కోట్లు ఇవ్వటం జరిగినదని చెప్పారు. ఆక్వా రంగానికి అనుబంధంగా ఉన్నటు వంటి ప్రాసెసింగ్ యూనిట్స్. ఫీడ్, సీడ్ కంపెనీలు దేశీయ మార్కెట్ను అభివృద్ధి చెయ్యాల్సి ఉందని చెప్పారు. చైనా, అమెరికా మీద మార్కేట్ ఆధార పడకుండా 3 నుండి 4లక్షల టన్నులు దేశీయ మార్కేట్లో అమ్ముడు పోయే విధంగా చేసేందుకు సీఎం వైస్ జగన్ మంచిగా ఆలోచించి ‘ఫిష్ ఆంధ్రా ను ఏర్పాటు జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా ఆక్వా యూనివర్సీటీ ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసారని చెప్పారు. అదే విధంగా శాస్త్రవేత్తలు ద్వారా ఆక్వా నూతన రొయ్య సీడ్స్ ను అన్వేషిస్తున్నారని అన్నారు.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా రైతులను ఆదుకోవాలని కృషి చేస్తున్నారని అన్నారు. ఆక్వా కల్చర్ అధారిటి ఏర్పాటు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అప్సడా ను ఎల్లవేళలా ఆక్వా రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.
డిమాండ్ సప్లయి మీద హెచ్చు తగ్గులతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ ఆక్వాకల్చర్ డవలప్ మెంట్ ఏర్పాటు చేసి సీఎం చైర్మన్ గా, వైస్ చైర్మన్ నన్ను నియమించి ఆక్వా రైతులను ఆదుకోవటానికి ప్రణాళికలు తయారు చేసామని చెప్పారు. రాష్ట్రంలో 4 లక్షల 65వేల ఎకరాలు సాగు చేస్తుంటే పది ఎకరాల లోపు ఉన్న రైతులకు విద్యుత్ యూనిట్ 1.50 సబ్సిడీని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ- ఫిష్ సర్వే చేసిన తర్వాత 1.44 ఎకరాలు మాత్రమే వచ్చినది. అయితే ఈ-ఫిష్ సర్వే సక్రమంగా జరగలేదని చెప్పటంతో మరలా సర్వే జరిపి 3.45 లక్షల ఎకరాలు ఆక్వాజోన్ వచ్చినదని వారికి రూ.1.50 సబ్సిడీ వస్తుందని అన్నారు. సీఎం దృష్టికి ఆక్వా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరిస్తున్నారు. నూతన విద్యుత్ కలెక్షన్లపై కూడ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఇంకా లబ్ది పొందాల్సిన రైతుల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, కావలి, ఒంగోలు పరధిలో విద్యుత్ కనెక్షన్లు 4623 కనెక్షన్లు ఇచ్చాము. మరలా 16వేల ఎకరాలు ఆక్వాకల్చర్ లోనికి వచ్చినదని తెలిపారు. ప్రతి జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరించటంతో అప్సడా ముందు ఉన్నదని అన్నారు. ఇంటర్నేషల్ మార్కేట్ నుండి వచ్చే సీడ్ విషయంలో కూడ ఆప్రమత్తండా ఉండాలని అప్పడా రైతులకు సూచించిందని చెప్పారు. రాష్ట్రం నలుమూలల 20 సమావేశాలు నిర్వహించి ఆక్వా రైతుల సమస్యలను చర్చించటం జరిగినదని అన్నారు. రేటు విషయంలో కూడ నిలకడగా ఉండే విధంగా చూసామని,ఫీడ్ పెంచిన సమయంలో కూడ సమస్యలను సీఎం వైస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి రోల్ బ్యాక్ చేసిన విషయం అప్సడా విజయం అని అన్నారు. సీపీ కంపెనీని థాయిలాండ్ నుండి 24 గంటలలో పిలిచి రేట్స్ రోల్ బ్యాక్ చేసిన విషయం రైతులకు తెలుసు అని అన్నారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా చేస్తున్న సీడ్ కంపెనీలను కోస్తా ఆక్వాకల్చర్ ఆథారిటితో మాట్లాడి మూసి వేయటం జరిగినది. ఆక్వా రైతులకు అవసమైన ప్రతి విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎంతో మేలు చేస్తున్నారని వివరించారు. రైతుల సుఖసంతోషాల కోసం నిత్యం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. కొంత మంది రైతులు ఆక్వాకల్చర్ చేస్తామని చెబుతున్నారని, వారి విషయం కూడ సీఎం దృష్టికి తీసుకువెళ్లే చేయండని సీఎం కూడ ప్రొత్సహించి అందుకు తగిన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కూడ రైతులు టైగర్ సీడ్ వలన నష్టపోయిన విషయాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సీడ్ కంపెనీని పిలిపించి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేసారని అన్నారు. ఆక్వా రైతులకు గతంలో ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. రేటు రూ.180 ఉన్నప్పుడు కూడ 210 తగ్గకుండా ప్రాసెసింగ్ ప్లాంట్స్ వారితో చర్చలు జరిగి తగ్గకుండా చూసామని చెప్పారు .కొస్తాంద్రలో విపరీతమైన లీజులు పెరిగాయని, దీంతో రైతులు నష్టపోతున్న విషయం తెలుసుకుని లీజుదారులతో చర్చలు జరిపి ఆక్వా రైతులకు లీజు రేట్స్ తగ్గించామని న్యాయం చేసామని చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం వలననే ఆక్వా రైతులు నేడు ఎంతో కొంత ఇబ్బందులు లేకుండా ఉన్నారని గుర్తు చేసారు. చివరి లబ్దిదారుడి వరకు మేలు జరిగేలా అప్సడా సంఘం కృషి చేస్తుందని అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
రోయ్యల రైతులు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఐవీఆర్ మోహన్ రాజు మాట్లాడుతూ …. ఉత్పత్తి పెరుగుతుందని కాబట్టి డిమాండ్ తగ్గుతుందని దేశీయ మార్కేట్ పెంపొందించుకోవటానికి అందరూ సహకరించాలని కోరారు. పలు సూచనలు చేసారు.రోయ్యల రైతులు ఫెడరేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ రోయ్యల రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కోంటున్న పలు సమస్యలను, విద్యుత్ సమస్యలను అప్పడా రాష్ట్ర వైస్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కనుమూరి భాస్కర్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, మత్య శాఖ జిల్లా జెడీ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, సంఘ గౌరవ అధ్యక్షుడు చాపల రమణయ్య, జిల్లా నాయకులు కె. సుబ్బా రెడ్డి, ఎస్. అంజి బాబు, ఎన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

