కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయ్యాలి, లేకుంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాము – మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేయాలని, లేకుంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో లేమని పార్టీ శ్రేణులు అదైర్య పడొద్దని, అన్నింటికీ తాను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. తన గెలుపుకోసం ఎంతో శ్రమించిన పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా నిలవడం వల్లనే భారీ మెజార్టీ తో గెలుపు సాధ్యమైందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పలు నూతన అభివృద్ధి పనులు మంజూరైనాయని, సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన కొన్ని పనులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు టి.మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, BRS పార్టీ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేందర్ రావు, సంతోష్, నాగులు, లక్ష్మీపతి, శేఖర్, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, ఏసూరి మహేష్, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, సురేందర్ సింగ్, కిషోర్, లలితా చౌహాన్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *