తాళ్లూరు మండలంలోని గుంటిగంగా భవాని అమ్మవారి ఆలయం వద్ద నూతనంగానిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో ధూపనైవేద్యం కోసం లక్ష రూపాయల విరాళం ఆలయ ధర్మకర్త సన్నెబోయిన వీరాంజనేయులుకి మంగళవారం మండలంలోని రామభద్రాపురం గ్రామానికిచెందిన బాపిరెడ్డి బాల చెన్నారెడ్డి కుమారుడు చిన్న
నాగిరెడ్డి వారి ధర్మపత్ని, గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మమ్మలు అందజేశారు. నూతన ఆలయంలోనిత్యం ధూపనైవేద్యం ఏర్పాటుకు బాపిరెడ్డి బాలచెన్నారెడ్డి రూ.లక్ష అందజేసినట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.
