తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో గురువారం గణిత మేధావి రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు ఎబీసీ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు మ్యాథ్స్ లో క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు. సర్ శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలను వివరించారు. విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. నిజ జీవితంలో మ్యాథ్స్ యొక్క ఆవశ్యకతను వివరించారు. విజేతలైన పలువురు విద్యార్థుల గురించి తెలిపారు. క్వీజ్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెంచుకుని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రాక్టీస్ చెయ్యాలని కోరారు. మ్యాథ్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎబీసీ హైస్కూల్లో మొదట అడుగు పెట్టిన విద్యార్థి మ్యాథ్స్ పట్ల కష్టంగా ఉంటారని, తర్వాత ఇష్టంగా మార్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగిన విషయాలను ఉదాహరణలతో వివరించారు. డైరెక్టర్ కె. కాలేషాబాబు మాట్లాడుతూ.. ఇతర సబ్జెక్టులలో రాణించాలంటే మ్యాథ్స్ పట్ల చిన నాటి నుండే ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం మ్యాథ్స్ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వెంకటరావు, విక్రమ్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యలమందరావు, కొండలు, సుబ్బయ్య, స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆయా పాఠశాలలలో రామానుజన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయా పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులకు మ్యాథ్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.












