మార్గశిర మాసం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని తాళ్లూరు మండలంలోని పలు దేవాలయాలు భక్తులలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాళ్లూరులో, తూర్పుగంగవరంలో ఆలయాలలో స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. బొద్దికూరపాడు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయంను, స్వామి వార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి గ్రామవీధులలో మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలను వంశ పారంపర్య ముక్కోటి వేడుకల నిర్వాహకులు గ్రామ మాజీ కరనీకం రాచపూడి కోటేశ్వరరావు మనుమలు కోటి, రాజు దంపతుల ఆధ్వర్యంలో స్వామి వార్లను ఊరేగించారు. కార్యక్రమంలో మాధవ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పులి అంజిరెడ్డి, ఆలయ పూజారులు నుదురుపాటి వెంకట రమణయ్య, ఉద్ధండం రమణయ్య గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.




