ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామానికి చెందిన రైతు గంగి రెడ్డి పెద్ద కొండ గురువా రెడ్డికి చెందిన బ్యారన్ ను విఠలాపురం రైతు నవులూరి సురేంద్ర మోహనరావు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. ఈ తరుణంలో శనివారం బ్యారన్ లో టైర్ విరిగి బ్యారన్ దగ్ధమైనది. అందులో రూ. 2లక్షల విలువైన పొగాకు రూ. 3లక్షల సామాను దగ్ధమైనది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. రూ.5 లక్షల వరకు నష్టపోయిన రైతును ఆదుకోవాలని తోటి రైతులు కోరుతున్నారు.

