నూతన సంవత్సర వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. చీమకుర్తిలో, దర్శిలో బూచేపల్లి నివాసం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి కుటుంబసభ్యులకు అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారిని గజ మాలలతో సన్మానించారు. కేక్ లు కట్ చేసి పంచి పెట్టారు.
ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కలిసి పూల మాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిథులు ఉన్నారు.





















