నూతన సంవత్సర వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. ఒంగోలులో పెస్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో ప్రజా ప్రతినిథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని వైసీపీ నాయకులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు. గజ మాలలతో సన్మానించారు. కేక్లు కట్ చేసి పంచి పెట్టారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ పూల మాలలు వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.









