తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన దాసరి నాగేశ్వరరావు (44) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. దీంతో ఆయనకు వైఎస్సార్ భీమా మంజూరు కావటంతో మట్టిఖర్చులకు ఆయన భార్య పౌల్ రాణిలకు రూ. 10వేల నగదును బుధవారం సర్పంచి మేకల చార్లేస్ సర్జన్ అందించారు. గ్రామకార్యదర్శులు లక్ష్మికాంత్, చిరంజీవి, వేల్పేర్ అసిస్టెంట్ క్రిష్ణా రెడ్డిలు పాల్గొన్నారు.
