కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలుసుకోవాలి, లబ్ధిదారులు వినియోగించుకోవాలి.

  • బిజేపి మహిళా మోర్చా నగర అధ్యక్షురాలు ధనిశెట్టి పావని రామునాయుడు.
  • సీతారామ పురంలో మహిళా చైతన్య సదస్సు.

ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ సీతారాంపురం పరిధిలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నగర అధ్యక్షురాలు ధనిశెట్టి పావని ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలను వివరించే సమావేశమును శర్మాకాలేజ్ క్రికెట్ గ్రౌండు వద్ద నిర్వహించారు. సమావేశమునకు ముఖ్యఅతిథిగా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధి, ఆరోగ్యం, దేశ రక్షణను ఆధ్యాత్మిక భావాలను ద్విగుణీకృతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలలో మహిళలకు సంబంధించిన పథకాలను వారు వివరించారు. తీగల సత్యవతి మాట్లాడుతూ భేటీ బచావో బేటి పడావో, మాతృ వందన యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ఈ శ్రమ్, అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు ఇస్తున్న పథకాల గురించి, భీమా ప్రయోజనాల గురించి వివరంగా తెలిపారు. వారి యొక్క సందేహాలను నివృత్తి చేశారు. ప్రస్తుతం 13000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన విశ్వకర్మ యోజన పథకం గురించి, వాని ఉపయోగాలను తెలిపారు. అవసరమైన వారి చే ఆన్లైన్ చేయించడం జరుగుతుందన్నారు.

మాతృ వందన యోజన కింద లబ్ధిదారులకు ఇంతవరకు నగదు రాకపోవటం స్థానిక రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకొన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కింద ఇందుర్తి పవన్, ఆశ దంపతుల కుమార్తె శాన్విక విగ్నేష్ కి సుకన్య ఖాతా తెరిపించి ఆయా ఖాతా పుస్తకాన్ని అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *