పశుసంవర్ధఖ శాఖ ఆధ్వర్యంలో పశుపోషకులకు అందిస్తున్న లక్ష్యాలను చేరుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. డీఎల్డీఏ సమావేశపు మందిరంలో శుక్రవారం పశువైద్య సహాయ శస్త్ర చికిత్సలు పశుసంవర్ధక సహాయ సంచాలకులు త్రైమాసిక సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఎడీ డాక్టర్ ఎస్ వెంకటరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ కె బేబి రాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఎడీ డాక్టర్ ఎస్ వెంకటరావు మాట్లాడుతూ శాఖలో జరుగుతున్న పురోభివృద్ధి, ఇచ్చిల లక్ష్యాల మేరకు గడ్డి విత్తనాలు, ప్రతి రోజు విజిట్ చెయ్యాల్సిన విధానాన్ని వివరించారు. పశువైద్యులు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ బేబి రాణి మాట్లాడుతూ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు, రుణాలు అర్హలైన వారికి అందించి వారి ఆదాయం పెంపొందించాలని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ షేక్ కాలేషా, పశువైద్యులు రమేష్, సోమయ్య, వెంకట సుబ్బయ్య, పద్మావతి, ఐఎస్ డిపి సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట రామి శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు
