మత్స్య శాఖ ఉత్పత్తులను వినియోగదారులకు చౌకగా అందించి వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని జిల్లా మత్యశాఖాధికారి ఆవుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శిక్షణా కేంద్రంలో శుక్రవారం ఫిష్ ఆంధ్రా మినీ స్టోర్ నిర్వహిస్తున్న యజమానులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్యశాఖాధికారి ఆవుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ఫిష్ ఆంద్ర సెంట్రల్ డెస్క్ నుండి తాజా నాణ్యమైన మంచి నీటి, సముద్రపు చేపలను, రొయ్యలను, రొయ్య ఉత్పత్తులను సంబంధించి ప్రాసెసింగ్ చేసిన ఆహార ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి వినియోగదారులు అందించటకు అవకాశాలను వివరించరాఉ. ఫిష్ మైల్స్ అనే సంస్థ వారు బతికిన చేపలను తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నట్లు వినియోగించుకోవాలని కోరారు. పిష్ ఆంధ్ర సెంట్రల్ డెస్క్ సంయుక్త సంచాలకులు (మెరైన్ ) వెంకటేశ్వర రావు, రవి శంకర్, మత్యశాఖ సహాయ సంచాలకులు ఉషారాణి, మత్స్య అభివృద్ధి అధికారులు, గ్రామ మత్స్య సహాయకులు, 60 మంది ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్ యజమానులు పాల్గొన్నారు.

