ఆదిత్య మెహతా ఫౌండేషన్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రసూల్ పూరాలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో పారా అథ్లెట్లను సత్కరించారు. తెలంగాణ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి తమిళిసై సౌందరరాజన్ వీడియో సందేశం అందించారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. పారాలింపిక్స్ 2024కు అర్హత సాధించిన అర్షద్, జ్యోతిల అంకితభావం, పట్టుదల ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన వరల్డ్ ఎబిలిటీ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు, ఆసియా క్రీడల్లో పాల్గొని పారాలింపిక్స్ 2024కు అర్హత సాధించిన క్రీడాకారులకు ఈ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నటి, నిర్మాత లక్ష్మి మంచు, ఏఎంఎఫ్ ట్రస్టీ, పాస్ట్ మిసెస్ ఇండియా, ఎంటర్‌ప్రెన్యూర్ శిల్పా రెడ్డి, ఎన్ఎండీసీ చైర్మన్ అమితవ్ ముఖర్జీ, జే ఎన్ వీ సౌత్ రీజియన్ హెడ్, డిప్యూటీ కమిషనర్ టీ గోపాల్ కృష్ణ, ఏఎంఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా హాజరయ్యారు.
జ్యోతి (15 ఏళ్లు) జావెలిన్‌లో కాంస్యంతో పాటు డిస్కస్ త్రోలో షాట్‌పుట్తో రజత పతకం గెలుచుకున్నారు. హ్యాండ్‌సైక్లింగ్‌లో ప్రశాంత్ కాంస్యం సాధించారు. డిస్కస్ త్రోలో వేణు స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. శివ (16 ఏళ్లు) జావెలిన్‌లో బంగారు పతకం, షాట్‌పుట్‌లో రజతం సాధించారు. జాను (15 ఏళ్లు) జావెలిన్‌లో కాంస్యంతో సత్తా చాటారు. శివాని (15 ఏళ్లు) షాట్‌పుట్‌లో ఒకటి, జావెలిన్‌లో రెండు బంగారు పతకాలు సాధించారు. ఖుష్భూ (15 ఏళ్లు) పారాషూటింగ్‌లో రజత పతకంతో తన నైపుణ్యం ప్రదర్శించారు. ఖుష్బూ మిక్స్‌డ్ విభాగంలో (పురుషులు, మహిళలు) సీనియర్ విభాగంలో 15 ఏళ్ల వయస్సులో రజతం గెలుచుకున్నారు. 15 ఏళ్ల వయస్సులో రజతం సాధించిన ఖుష్బూను ప్రత్యేకంగా అభినందించారు. అర్షద్, జ్యోతి పారాలింపిక్స్ 2024కు అర్హత సాధించారు.
కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్లు, క్రీడా పరికరాలతో సహా రూ.1.5 కోట్ల విలువైన శిక్షణా పరికరాలను ఏఎంఎఫ్ అందించింది. ఇప్పటివరకు ఏఎంఎఫ్ తో సాగిన ఈ ప్రయాణంలో పిల్లలను స్పాన్సర్ చేసిన వారు లేకుంటే ఈ ప్రయాణం కష్టంగా సాగేది. జవహర్ విద్యాలయ సమితితో ఎన్ ఎం డీ సీ, యూ ఎస్ టీ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ముద్ర ట్రస్ట్, జీఎంఎంసీవో కలిసి ఉన్నాయి.
పారా అథ్లెట్లు స్థిరత్వం, సంకల్పం మరియు ధైర్యం, సంకల్ప శక్తి, అంకితభావానికి ప్రతిరూపం. వారు సవాళ్లను విజయాలుగా మార్చుకుని, మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు. అపరిమితమైన మానవ సామర్థ్యాన్ని పారా అథ్లెట్లు చూపుతారు. వారి అథ్లెటిక్ ఫీట్స్ పరంగా మాత్రమే కాదు సవాళ్ళను అవకాశం గా మలుచుకుని సాధించిన విజయాలను వేడుక చేసుకుంటున్నాము. నిజమైన క్రీడాస్ఫూర్తికి ఉదాహరణగా వారు నిలవటం తో పాటుగా మనకు స్ఫూర్తినిస్తారు. పారా ఒలింపిక్ క్వాలిఫికేషన్ చెప్పుకోదగ్గ విజయం. క్రీడలు విశ్వాసం మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని వారు విశ్వసిస్తారు. స్పోర్ట్స్ లో ప్రతి బిడ్డను ప్రోత్సహించడం చాలా అవసరం. పారా అథ్లెట్ల అర్హత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఔత్సాహిక అథ్లెట్లు సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తి దాయకం. అదిత్య మెహత ఫౌండేషన్ గత దశాబ్ద కాలంగా పారా అథ్లెట్ల ను శిక్షణ అందీస్తుంది. కేవలం వారి ఆత్మవిశ్వాసం పెంపొందించటం మాత్రమే కాదు వారి సామర్ధ్యాలను సైతం పెంపొందిస్తున్నారు. ఈ అథ్లెట్ల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని వారు చూపుతున్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ పారా అథ్లెట్లు మనకు స్ఫూర్తిని అందించటం తో పాటుగా దేశానికి గర్వ కారణంగా నిలుస్తారని ఆశిస్తున్నాను.