సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. దర్శి లోని జూనియర్ కళాశాల, హై స్కూల్ లో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మహిళల జట్లు, పురుషుల జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీలు మూడు రోజులు జరుగుతాయని, పురుషులకు, స్త్రీలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. మొదటిబహుమతి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.40 వేలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు.



