ఎబీసీ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలలో బాగంగా శనివారం ముగ్గుల పోటీలు ప్రారంభమైనాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీలలో పాల్గొని ముచ్చటగా ముగ్గులు వేసారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఉంటాయని, ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సంక్రాంతి సంబరాల సందర్భంగా అందజేస్తామని ఎబీసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు తెలిపారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్ కాలేషాబాబులు పాల్గొన్నారు.













