బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి (బి.వి.ఏస్. ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, మెటీరియల్స్, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ లు సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ రాచ పూడి రత్నంలు చేతుల మీదుగా ట్యాబ్ లు , పుస్తకాలు పంపిణీ చేశారు. తూర్పు చౌటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నాడు-నేడు, అమ్మవడి వంటి మంచి పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. పీసీ చైర్మన్ రాచపూడి ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు పి.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు మారం నాగిరెడ్డి. భాస్కర్ పాల్గొన్నారు.
బూచేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
07
Jan