పాత్రికేయ, సాహిత్య, ఆధ్యాత్మిక, కళారంగాలలో
మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి పొన్నూరు వెంకట శ్రీనివాసులు జిల్లాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా పూర్ణకుంభ పురస్కారం అందుకున్న సందర్భంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా సత్కరించారు. గాంధీ రోడ్ గీతా మందిరంలో జరిగిన కార్యక్రమంలో నెమ్మాని తన ప్రసంగంలో పొన్నూరు చేస్తున్న సేవలను అభినందించారు. తెలుగు భాషతో పాటు తమిళంలో కూడా పట్టు సాధించి, తిరుప్పావైని భక్తులకు సరళంగా అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతా మందిర నిర్వాహకులు పాల్గొన్నారు.

