ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని చిన్నారులతో నిరసన అంగన్వాడీలు

28వ రోజు అంగన్ వాడీల ICDS ఆఫీసు వద్ద సమ్మె చేశారు. యూనియన్ నాయకురాలు తిరపతమ్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం అత్యంత దుర్మార్గమైన చర్య అని సిఐటియు దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. మాట్లాడుతూ అంగన్వాడీలను అత్యవసర చట్టం క్రిందకు తీసుకువచ్చి ఉద్యమాన్ని అణిచి వేయాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అంగన్వాడీలు దీన్ని తిప్పికొట్టాలని, ముఖ్యమంత్రి హామీనీ అమలు చేయాలని, పోరాటం చేయడం తప్పా అని ప్రశ్నించారు.
కందిపప్పు, నూనెలు, బియ్యం, పెట్రోల్ , గ్యాస్ , కరెంటు చార్జీలు బాగా పెంచి, వేతనాలు పెంచకపోవడం వలన అంగన్ వాడీలు , కార్మికులు అప్పులు పాలౌతున్నారని అవేధన వ్యక్తం చేశారు.
చినపిల్లలు అంగన్ వాడీలకు మద్దత్తు నినాదాలు ఇవ్వడం ఉత్తేజం కల్పించింది. సమ్మెలో నాయకులు నాగజ్యోతి , అచ్చమాంబ, పద్మావతి , సుజాతా , జయమణి , అనిత , శివకుమారి , నాగమణి , మల్లేశ్వరి ,వెంకటరమణ , విశ్వవాణి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *