మున్సిపల్ కార్మికుల సమ్మె బిజెపి దర్శి అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు మద్దతు తెలిపారు. ధర్నా శిబిరానికి వెళ్లి కార్మికులకు సంఘీభావం ప్రకటించి కార్మికులతో సెమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలు ఇళ్లల్లో కూర్చుంటే కార్మికులు బయటికి వచ్చి ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ పని చేశారని, అలాంటి కార్మికులకు న్యాయపరమైన కోరికలయిన వేతనాలు పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అచ్యుత గురువర్ధనరావు, రూరల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగసాయి, యువ నాయకులు చెరుకూరి అనిల్, నాగభూషణాచారి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
