మహిళా రైతు సంఘాలకు రూ.3 కోట్ల రుణాలు – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

తాళ్లూరు మండలంలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.3 కోట్ల బ్యాం కు రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయా ధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు కెనరా బ్యాంకులో 70 మహిళా రైతు సంఘాలకు రూ.3 కోట్ల బ్యాంకు రుణాలను బ్యాంకు మేనేజర్ ధర్మసాయి చేతుల మీదుగా సోమవారం మంజూరు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ మండలం లో వివిధ గ్రామాల్లో 150 మహిళా రైతు ఉత్పత్తిదా రుల సంఘాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందులో అర్హతగల 70 సంఘాలకు మూడు కోట్ల ఎనిమిది లక్షల రుణాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో
సక్రమంగా చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు. ఇంకా ఆశక్తి ఉన్న మహిళా రైతులు రైతు ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడితే వాళ్లకి కూడా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *