డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళనల్లో బాగంగా అంగన్వాడీ కార్యకర్తలు 31వ రోజు గురువారం పట్టణంలో నిరసన ర్యా లీ చేశారు. గడియార స్తంభం సెంటర్లో రాస్తారోకో చేసి వాహనాలను నిలిపి వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సమస్యలు ప రష్కరించకుండా కార్యకర్తలకు నోటీసులు ఇ వ్వటం దారుణమన్నారు. ప్రభుత్వ ఆ దేశాలతో అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించకుంటే భవిష్యత్లో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నా యకులు బాలమ్మ, తిరుతపమ్మ ,ప్రశాంతి, నా గమణి, రంగమ్మ, ఫాతిమా, వెంకటరమణ, విశ్వవాణి, సుబ్బమ్మ పాల్గొన్నారు.
