వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జిగా డాక్టర్ బూచేపల్లి

వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చా ర్జిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతో కాంగ్రెస్ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగారు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనల మేరకు 2009 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీలో కొనసా గుతూ వచ్చారు. సంవత్సరం ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగనన్న వెం ట నడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారు. ఆ తరువాత తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి అనా రోగ్య కారణాలతో 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే పార్టీ నిలబెట్టిన మద్దిశెట్టి వేణుగోపాల్ ను 39 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేశారు. దర్శితో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో టీజేఆర్ సుధాకర్ బాబును కూడా అత్య ధిక మెజార్టీతో గెలిపించారు. వైఎస్సార్ సీపీ క్యాడర్ ను కాపాడుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. దర్శి జెడ్పీటీసీగా శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బూచేపల్లి కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తించిన సీఎం బూచేపల్లి వెంకాయమ్మను జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేశారు. ఆ తరువాత జిల్లాతో పాటు దర్శి, సంతనూతలపాడు రెండు నియోజకవ ర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యక ర్తలు, బూచేపల్లి అభిమానులకు అండగా ఉం టూ వారి అవసరాలు తీరుస్తూ వారి అభిమానం పొందుతున్నారు. ఈ తరుణంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించడంపై దర్శి , చీమకుర్తి లతోపాటు జిల్లాలోని వైఎస్సార్ సీపీశ్రేణులతో పాటు బూచేపల్లి అభిమానులుసైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *