బొద్దికూరపాడు గ్రామానికి చెందిన యలమంద భార్య ఆదిలక్షమ్మకు శుక్రవారం వైఎస్సార్ భీమా ద్వారా మంజూరు అయిన రూ. 10వేలు నగదును అందించారు. యలమంద ప్రమాదంలో మృతి చెందిగా ఆయనకు రూ. 5లక్షలు వైఎస్సార్ భీమా మంజూరు అయినట్లు మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి తెలిపారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ కొప్పుల బాల కోటయ్య, పీఎంసీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి, సంగన సుబ్బా రెడ్డి, సగిలి నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
