మొక్కజొన్న కీలక దశలో నీరు అందించాలి – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

రబీలో వేసిన మొక్కజొన్న పంటకు కీలక దశలో నీటిని అందించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మండల కేంద్రమైన తాళ్లూరు, కొత్తపాలెం గ్రామాల్లో పర్యటించి మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు,సలహా లు ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. తాళ్లూరు మండలంలో 850 ఎకరాల విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు .మొక్కజొన్నను ఏనుగు పంట అంటారని ఈ పంట సాగు సులభతరం,దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వరి,పొగాకు పంటలకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట సాగు వైపు దృష్టి సారించారని ఆయన తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు పాటిస్తూ మొక్కజొన్న పంటలో ఎక్కువ దిగుబడిని సాధించి అధిక ఆదాయం పొందాలని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ నాగ రాజు, వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *