జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫర్ జాబ్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి ఉపాధి కార్యాలయం నందు విభిన్న ప్రతిభావంతులకు పలు రకాల ఉద్యోగాల నియామకానికి ఈనెల 23న ఒంగోలులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించబడునని విభిన్న ప్రతిభా వంతుల సహాయ సంచాలకు జి అర్చన తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు జాబ్ మేళా నిర్వహించబడునని చెప్పారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి. పది తరగతి ఆపైన విద్యను అభ్యసించిన విభిన్న ప్రతిభావంతులు మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఇంటర్వ్యూకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ. 1.2 నుండది 3.1 లక్షల వరకు వేతనం ఇవ్వబడునని చెప్పారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులైన యువతీ యువకులు ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలను ఫోన్ నంబర్లు 7989244381, 9160797311లను కార్యాలయం వేళల్లో సంప్రదించాలని కోరారు.
23న విభిన్న ప్రతిభావంతులు జాబ్ మేళ – విభిన్న ప్రతిభా వంతుల సహాయ సంచాలకు జి అర్చన
20
Jan