బొద్దికూరపాడులో ముగిసిన క్రికెటర్ టోర్నమెంట్

తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో
రాజారెడ్డి యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ లో తాళ్లూరు మండలం తో పాటు ఇతర మండలాల నుండి 22 టీములు క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో బొద్ది కూరపాడు రాజారెడ్డి లెవెల్స్ టీం ప్రథమ స్థానం సాధించగా రూ.15,000 ప్రధమ బహుమతిని మాజీ సొసైటీ అధ్యక్షుడు , గ్రామ ఉపసర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి అందించారు. వెలుగువారిపాలెం టీము ద్వితీయ బహుమతి సాధించగా దీనికి స్పాన్సర్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ గంగ వరపు శివారెడ్డి ద్వితీయ బహుమతి రూ. 10,000 అందించారు. అయ్యప్ప రాజుపాలెం టీమ్ కు తృతీయ బహుమతి రూ. 5000 మాజీ ఎంపీటీసీ భోగసముద్రం గోపాల్ రెడ్డి అందచేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ.2000 కళ్యాణి,సొసైటీ సెక్రటరీ పులిశ్రీనివాస్ రెడ్డిలు అందించారు. మ్యాన్ ఆఫ్ ది కెప్టెన్ బహుమతిని సగిలి రోసిరెడ్డి, పులి ప్రభాకర్ రెడ్డిలు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *