జగనన్నను మళ్లీ ముఖ్య మంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, కొత్తపాలెం గ్రామాల్లో ఆయన ఆదివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా తాళ్లూరులో వైఎస్ ఎంపీపీ యుడమకంటి వెంకటేశ్వరరెడ్డి దంపతులు, నాయకులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డికి ఘనస్వాగతం పలికారు. తాళ్లూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ …పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్ ఉంటుంద న్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి న్యాయం చేస్తానన్నారు. మనందరి లక్ష్యం జగ నన్నను మరోసారి సీఎంని చేయడమేనన్నారు. కార్యకర్తకు ఎలాంటి కష్టం వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉండి ఆదుకుంటానన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపో వద్దన్నారు. మా కుటుంబానికి తాళ్లూరు మండలంతో విడదీయరాని బంధం ఉందన్నారు. 20 ఏళ్లుగా తాళ్లూరు మండల ప్రజలు బూచేపల్లి కుటుంబంపై చూపిన ప్రేమ, అభిమానాలు మరువలేనివన్నారు. మీ రుణం తీర్చుకునేందుకు, మీకు సేవ చేసేందుకే మరో సారి జగనన్న నాకు అవకాశం కల్పించారని ఆయన నమ్మకాని నిలబెడతానన్నారు. మీలో ఒక డిగా నిలిచి అందరి అండదండలతో అందరిని కలు పుకొని ముందుకు సాగుతానన్నారు. జగనన్న పాలనలో మనందరి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయన్నారు. నాయకులకు, కార్యకర్తలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండి సేవచేస్తానన్నారు. అనంతరం కొత్తపాలెంలో ఇటీవల కంటి ఆపరేషన్ చేపించుకున్న జెడ్పీటీసీ మారం వెంకారెడ్డిని పరా మర్శించారు. పలువురు ముఖ్యనాయకులు ఎడమ కంటి రమణారెడ్డి, దారం పాపిరెడ్డి, కైపు వెంకటే శ్వరరెడ్డిలను కలిశారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీ అందరి సహకారం, అండ దండలతో అందరినీ కలుపుకుపోతానన్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ యిడమ కంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్లు మేకల చార్లెస్ సర్జన్ సుబ్బారావు, వలి, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ ప్రభాక రరెడ్డి, నాయకులు పులి ప్రసాదరెడ్డి, కైపు వెంకటే శ్వరరెడ్డి. కోట కలింగారెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, మేడగం రమణారెడ్డి, వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


