శ్రీరాముని దయతో దర్శి నియోజకవర్గంలోనిప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రైతుల పం టలు బాగా పండాలని, వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని వైఎస్సార్ సీపీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా డాక్టర్ బూచేపల్లి నివాసంలో శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తరెడ్డిపాలెం రామాలయం, గాంధీనగర్ లోని కోదండరామాలయం, కొత్తపాలెంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హాజరైన డాక్టర్ బూజ్జిపల్లి శివప్రసాదరెడ్డి ని దుశ్శాలు వాలతో ఘనంగా సత్కరించారు. కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన ఎస్ఈడీ స్క్రీన్లో రామాలయం ప్రతిష్ట మహోత్సవాలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో డాక్టర్ బూచేపల్లి పాల్గొన్నారు. మండల కన్వీనర్ వెన్నపూస వెం కటరెడ్డి, కౌన్సిలర్లు ఆవుల జ్యోతి శివారెడ్డి,మేడం మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్య క్షుడు బండి గోపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమి రెడ్డి చెన్నారెడ్డి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యరమల మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గంజి వెంకటేశ్వర రెడ్డి, కిక్కురు రమణారెడ్డి, మేడగం పుల్లారెడ్డి, కుందురు నరశింహారెడ్డి, శ్రీలం శ్రీనివాసరెడ్డి, ఎదురు నారాయణరెడ్డి, వెన్నపూస పేరిరెడ్డి, చం ద్రగిరి గురవారెడ్డి పాల్గొన్నారు.





