దర్శి నియోజకవర్గ ఓటర్లు 2,23,685 మంది – తాళ్లూరు మండలం లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

దర్శి నియోజకవర్గంలోని అయిదు మండలాలకు
సంబంధించిన ఓటర్ల జాబితాను దర్శి ఈఆర్వో లోకేశ్వరరావు తహసీల్దార్
కార్యాలయంలో సోమవారం విడుదలచేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోవాటిని ప్రచురించాలని బీఎల్వోలను ఆదేశించారు. 2023 జనవరి 5 నుంచితొలగింపు పరిశీలనలకు సంబంధించిఎలాంటి తప్పులు దొర్లలేదని తహసీల్దార్లు నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలి పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల మేర పూర్తిస్థాయి విచారణ జరిపి 1812 (మృతులు, రెండు చోట్ల పేర్లున్న, శాశ్వతంగా వలస వెళ్లిన, అందుబాటులో లేని వారివి) ఓట్లు తొలగించినట్లు వివరించారు. 27.10.2023 నుంచి నియోజకవర్గం పరిధిలో 6,598 చేర్పులు, 4,546 తొలగింపులు, 1604 మార్పులు(షిఫ్టింగ్), 5741 మార్పులు (కరె క్షన్స్) దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు
పోలింగు కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పిస్తా మని దర్శి నియోజకవర్గ ఈఆర్వో ఎంవీఎస్. లోకేశ్వరరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురం, తాళ్లూరు, రజానగరంలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, వికలాంగులు, వృద్ధులు వెళ్లడానికి వీలుగా ర్యాంప్ ల ను ఏర్పాటు చేయిస్తామ న్నారు. ఆయా కేంద్రాల వద్ద చేపట్టాల్సిన పనుల గురించి బీఎల్వోలు, ఇతర అధికారులకు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *