గ్రామ/వార్డు సచివాలయ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం జిల్లా పశుసంవర్ధశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసం వర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి మాట్లాడు తూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 177 యాని మల్ హస్బెండరీ పోస్టులకు పరీక్ష నిర్వహిం చగా 2500 మంది హాజరయ్యారని, అందులో మెరిట్, రోస్టర్ ప్రకారం 109 మంది అభ్య ర్థులు అర్హత సాధించారని చెప్పారు. అందులో 37 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించామని తెలిపారు. మరో 72 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు మంగళవారం పరిశీ లిస్తామన్నారు. ఎంపిక కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈనెల 25వ తేదీన నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు.
