రాజ్యాంగం పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉండాలి- ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు

దేశంలోని పౌరులందరినీ అన్ని విషయాలలో సమానంగా చూస్తూ అన్నిటిలో సమ న్యాయం అందించాలి. అనగా కుల,మత,జాతి,లింగ వివక్షత లేకుండా దేశంలోని పౌరులందరూ సమానమని భారత రాజ్యాంగం తెలియజేస్తుందని తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు అన్నారు.దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ముఖ్యాంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడినారు. డి.బి.ఆర్.సి ఏరియా కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు జరిగిన కార్యక్రమం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. శేషగిరి మాట్లాడుతూ మనదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల ద్వారా నాయకులను ఎన్నుకుంటారు. భారతరాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాల లోపు బాల,బాలికలకు 42 హక్కులు పొందుపరచడం జరిగిందని వాటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కులు పొందుపరచడం జరిగిందని ఆయన అన్నారు.డిబిఆర్సి రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని 17 మరియు 21 ఆర్టికల్ పై ఏ ఒక్కరి పైన కుల,’మత, వైకల్యం పేరుతో వివక్షత చూపరాదని అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని భారత రాజ్యాంగం పేర్కొందని ఆయన తెలియజేశారు. కళాశాల సివిక్స్ లెక్చరర్ వై.గురవయ్య మాట్లాడుతూ మనం చేసే పని ద్వారా ఇతరులకు హాని కలుగకుండా పౌరులందరికీ తమ ఆలోచనలను తెలియజేసేందుకు తమకు నచ్చిన చోట్ల జీవించేందుకు, నచ్చిన స్నేహితులను ఎన్నుకునే అందుకు,ఇష్టమైన మతాన్ని అనుసరించేందుకు, నమ్మకాలను కొనసాగించేందుకు హక్కు ఉంది అని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులు ఫోటో ఎగ్జిబిషన్ తిలకించినారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *