వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తా -ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి – దర్శి నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన యువ నేత మాగుంట

వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసే ఆలోచన ఉందని జిల్లా వైసీపీ యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి చెప్పారు. దర్శి నగర పంచాయతీ కౌన్సిలర్ వీసీ రెడ్డి నివాసానికి ఆయన బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసినందు వలనే ప్రజలు తమను ఆదరిస్తున్నారన్నారు. ఈ సంద ర్భంగా పలువురు నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దామెర్ల చంద్రం, మాజీ సర్పంచ్ శేషిరెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ బత్తి నేని వెంకటేశ్వర్లు,ముండ్లమూరు మండల వైసీపీ అధ్య క్షుడు సుబ్బారెడ్డి, తాళ్లూరు ఎంపీపీ శ్రీనివాసరావు, జిల్లా యువజన అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, యలమందారెడ్డి, కూకట్ల వీరబ్రహ్మం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జడ్పీటీసీని మారం వెంకటరెడ్డి ని పరామర్శించిన రాఘవరెడ్డి

కంటి ఆపరేషన్ చేయించుకుని సొంతూరైన కొత్తపాలెంలో ఉంటున్న జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డిని మాగుంట రాఘవరెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, మండల కోఆప్షన్ మెంబెర్ కరిముల్లా,పూర్ణచంద్రరావు, కోట మన్నేరెడ్డి, నగుళ్ల వెంకట రావు, డైరెక్టర్ ఎం.ఎ. ప్రసాద్ రెడ్డి, దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీరెడ్డి, సర్పంచ్లు కాలేషావలి, చార్లెస్ సర్జన్, సుమలత శ్రీకాంత్ రెడ్డి, గుంటిగంగ ఆలయ చైర్మన్ కొసన గురుబ్రహ్మం, ఉపసర్పంచ్ యత్తపు కాశిరెడ్డి, సయ్యద్ లతీఫ్ ఉన్నారు.

ఎంపీ నిధులతో నిర్మించిన బసెషెల్టర్ పరిశీలన..

కొర్రపాటిపాటివారిపాలెం గ్రామ స్థుల విన్నపం మేరకు ఎంపీ మాగుంట ఎంపీల్యాడ్స్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయగా నిర్మించిన బసెల్టర్ ను ఎంపీ తన యుడు రాఘవరెడ్డి పరిశీలించారు. గ్రామ వైసీపీ నేత కొర్రపాటి శరత్, మన్నే రెడ్డి, పూర్ణ వెంకట్రావు తదితరులు ఉన్నారు.
రాఘవ రెడ్డి ని సన్మానించిన ముండ్లమూరు వైసీపీ మండల అధ్యక్షుడు

మాగుంట దర్శికి రావటంతో మండల వైసీపీ అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి దర్శి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానిం చారు. ఆయన వెంట గోపనబో యిన ఫిలిప్, చింతా వెంకట శ్రీనివాస రెడ్డి తదితరులు  ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *