నవరత్నాల పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి – తాళ్లూరు మండలంలో రజానగరం నుండి ప్రచారం ప్రారంభం

నవరత్నాలతో పేదల జీవితాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసి కృతజ్ఞతలు చెప్పుకుందామని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు అన్నారు. తాళ్లూరు మండలం రజానగరం గ్రామం నుండి శుక్రవారం ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో 175 నియోజక వర్గాలకు గాను 175 చోట్ల విజయసాధిస్తున్నామని చెప్పారు. బూచేపల్లి కుటుంబం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నందిని గ్రామంలో ఇంటింటికి తిరిగి అందరినీ అప్యాయంగా పలకరిస్తూ తమను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముందుగా ఆంజనేయస్వామి, శివాలయం, మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచి షేక్ వలి, మాజీ ఎంపీటీసీ పులి వికాస్, ఎంపీటీసీ మేడగం వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం యూత్, రజానగరం యూత్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి, నందినిలకు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిథి డాక్టర్ ఎస్ఎం భాష , జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదామ్ షరీఫ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోష, వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు వలి, మారం ఇంద్ర సేనా రెడ్డి, ఇస్మానియేల్, మందా శ్యామ్సన్, కెఎస్ వెంకట రామిరెడ్డి, ఉప సర్పంచి రామ్మూర్తి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, మాజీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచి టి శంకర్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ, మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ లతీఫ్, మాజీ సర్పంచిలు మేడగం శ్రీనివాస రెడ్డి, చింతా శ్రీనివాస రెడ్డి, నాయకులు మేడగం చెన్నారెడ్డి, కోటి రెడ్డి, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *