తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ పాఠశాలలో కార్యాలయాలలో 75వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కెవై కీర్తి, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలలో తహసీల్దార్ ప్రసాద్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రమణయ్య ఎంఆర్సీ వద్ద ఎంఈఓ జి. సుబ్బయ్య జెండాను ఎగుర వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, సర్పంచిలు మేకల చార్లేస్ సర్జన్, కోఆప్షన్మెంబర్ కరిముల్లాలు పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాముఖ్యతను వివరించారు.



