ఆడుదాం ఆంధ్రా నియోజక వర్గ స్థాయి పోటీలలో పామూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంభాల దిన్నే విద్యార్థులు కబాడ్డీ పోటీలలో ప్రతిభ చాటి ప్రధమ స్థానంలో నిలిచారు. కనిగిరి పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్లో జరిగిన పోటీలలో ప్రధమ స్థానంలో నిచి ప్రైజ్ మనీ రూ.35,000, మెమెంటోను అందుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు పఠాన్ మహాబూబ్ ఖాన్, పీఈఓ నరసింహా రావు లు అభినందించారు. ఇదే స్పూర్తితో జిల్లా స్థాయి పోటీలలో కూడ సత్తా చాటాలని కోరారు.

