వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు మంచి సర్వీసు అందించి విజయసారథుల్లా నిలవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచిం చారు. దర్శి తాలూకా క్లబ్ సమావేశం హాలులో మండలంలోని వలంటీర్లతో నగర పంచాయతీ కమిషనర్ మహేశ్, ఎంపీడీఓ హనుమంతరావుల అధ్యక్షతన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వలంటీర్లు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రస్తుతం రానున్న ఎన్నికల సందర్భంగా వారు నడుచుకోవాల్సిన తీరు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సర్వీసుల గురించి చర్చించారు. వలంటీర్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అని అడిగి తెలుసుకున్నారు. బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చా ల్సిన బాధ్యత వలంటీర్లదే అన్నారు. గ్రామ స్వరాజ్యం సాధించాలనే ముఖ్య ఉద్దేశంతోవలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అభి వృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీలకతీతం గా సమన్యాయం చేశారన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియమించి ఇంటింటికీ సంక్షేమ ఫలాలు నేరుగా అందిం చారన్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే సూర్యుడు ఉదయించేలోపే వలంటీర్ తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారంటే జగనన్న నిర్ణ యాలు ప్రతి ఒక్కరూ స్వాగతించాలని సూచించారు. గతంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు దోచుకోవడం, దాచుకోవడమే చేశారన్నారు. జగనన్న చేస్తున్న మేలును ప్రతి వలంటీర్ గమనించి ప్రజలకు అందాల్సిన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. వైనాట్ 175 అనే నినాదం జగనన్న చేశారంటే వలంటీర్లు ప్రభుత్వం తరపున మంచి సేవలు అందిస్తుం డబట్టేనని చెప్పారు. అందుకే ప్రతి వలంటీర్ తమ గ్రామంలో పార్టీలకతీతంగా సేవలందిం చి ప్రజలకు మంచి చేయాలని కోరారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగం రాష్ట్ర అధి కార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, కౌన్సిల ర్లు మేడం మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి, ఎంపీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, సర్పంచ్ లు కేసరి రాంభూపాల్ రెడ్డి, కొరివి కోటయ్య, విజయ్, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీరెడ్డి, డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
