నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తా – దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. బుధవారం దర్శి ఎమ్మెల్యే నివాసంలో నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తనను గతంలో ఎప్పుడు లేని విధంగా 40 వేల మెజార్టీతో గెలిపించారని అన్నారు. దొనకొండ, ముండ్లమూరు ఎంపీపీల విషయంలో వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేశానన్నారు. జీవితంలో విజయం చూశాను గానీ ఓటమి చూడలేదన్నారు. ప్రస్తుతం కొంతమంది అధికారులు తనను నమ్మిన వారిని ఇబ్బంది పెడుతున్నారని, తాను ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు ఘనంగా సన్మానించారు. వైసీపీ దర్శి ఇన్ఛార్జిగా బూచేపల్లిని ప్రకటించిన తరువాత మొదటిసారిగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వస్తున్న సందర్భంగా ముండ్లమూరు నుండి వాహనాలతో భారీ ర్యాలీగా దర్శికి చేరుకున్నారు. కార్యక్రమంలో మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి వాసు, ఏఎంసీ చైర్మన్ మిల్లర్ బుజ్జి, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఎంపీపీలు బెల్లం చంద్రశేఖర్, జడ్పీటీసీ మారం వెంకారెడ్డి, మాజీ జడ్పీటీసీ
శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *