మోసానికి మరో రూపం చంద్రబాబు -సంక్షేమ పథకాలు ఎత్తేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?-కరోనా విపత్తులోనూ సంక్షేమాన్ని కొనసాగించిన ఘనత సీఎం జగన్ దే.వైఎస్సార్ ఆసరా చెక్కు పంపిణీలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ-600 హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు అవసరమా? : దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి -మహిళా భవన్ నిర్మాణానికి జెడ్పీ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన

ఎన్నికల హామీలను గద్దెనెక్కగానే గాలికొదిలేసిన టీడీపీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మోసానికి మరో రూపమని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎత్తేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. కురిచేడులోని ఏఎంసీ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ తో పాటు వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డ్వాక్రా మహిళలకు రూ.4.45 కోట్ల చెక్కు అందజేశారు. తొలుత వీరికి మహిళలు ఘన స్వాగతం పలికారు. పొట్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కోలాట ప్రదర్శన చేశారు. మహిళ లతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలే కాకుండా చెప్పని హామీలను సైతం సీఎం జగన్ అమలు చేశారని కొనియాడారు. నామినేటెడ్ పదవుల్లో సైతం మహిళలకు 50 శాతంరిజర్వేషన్ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దేన న్నారు. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోగా మేనిఫెస్టోను ఆన్లైన్లో మాయం చేశాడని దుయ్యబట్టారు. తన కుమారుడు శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని మహిళలను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మహిళా పక్షపాతి సీఎం జగన్

మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తే ఆ కుటుంబం బాగుపడు తుందని సీఎం వైఎస్ జగన్ బలంగా నమ్మారని, అందుకోసమే ప్రతి పథకం మహిళల పేరునే అందిస్తున్నారని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు నాలుగు విడతల్లో రూ.25 వేల కోట్లు అందించారని తెలిపారు. ప్రజలకు పథకాలు ఇస్తే సోమరిపోతులవు తారని మాట్లాడిన చంద్రబాబుకు ఓటడిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిపించుకుకోవాల్సిన అవసరముంద న్నారు. దర్శి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని తమ కుటుంబానికి ఇవ్వాలని అభ్యర్థించారు. మహిళల భవన నిర్మాణానికి జెడ్పీ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తల్లి వెంకాయమ్మతో కలిసి ప్రకటించారు.

కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, ఎంపీటీసీలు కానాల శివారెడ్డి, బుల్లం వెంకట నర్సయ్య, అన్నెం అరుణ, షేక్. కాశింబి, సర్పంచ్ లు కేసన పల్లి కృష్ణయ్య, మాలెపాటి నాగేశ్వరరావు, కాసు భాస్కరరెడ్డి, నక్కా రామకృష్ణ, బొమ్మనబోయిన మహేష్, ఆసుపల్లి రామల క్ష్మమ్మ, బొరిగర్ల గోవింద్, సొసైటీప్రెసిడెంట్లు ఆరె శ్రీనివాసరావు, మానం కోటయ్య, పోతిరెడ్డి నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వై వి సుబ్బయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ కండె గంగయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, దొనకొండ, కురి చేడు జేసీఎస్ కన్వీనర్లు గుంటు పోలయ్య, మేరువ సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దేవప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, ఎన్వీ నాగిరెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీడీఓ సీతారా మయ్య, ఈఓఆర్డీ ఆర్వీఎస్ ప్రసాదరావు, వైఎస్సార్ కేపీ ఏరియా కో ఆర్డినేటర్ వసుందరాదేవి, ఏపీఎం జాన్ సైమన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *