తాళ్లూరులోని రెండోసచివాలయం పరిధిలోనిఎస్సీ కాలనీ ప్రాథమికపాఠశాల ఆవరణలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్షా పథకం రెండోవిడత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ మాధవీలత శిబిరాన్ని సందర్శించి అందుతున్న వైద్య సేవలు, నిర్వహణ తీరు ను పరిశీలించారు. వైద్యులు డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి , డాక్టర్ రాజేష్ , డాక్టర్ శ్వేతా రెడ్డి లు 235 మంది రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సి హెచ్ ఓ ఫాతిమా, పీహెచ్ఎన్ నసీరాబేగం, హెచ్ వి. కోటేశ్వరి పాల్గొన్నారు.



