లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేసిన బాజపా ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి.

కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన భారత అత్యున్నత అవార్డు భారతరత్న పురస్కారాలు వానిలో బిజెపి కురువృద్ధుడు, సీనియర్ నేత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త, భారత మాజీ హోం శాఖ మంత్రి మరియు భారత ఉప ప్రధానిగా బాధ్యతలు నెరపిన లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పీవీ శివారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ పరిపాలనలో బాధ్యతలు నెరపి దేశాభివృద్ధికి కృషిచేసిన వీరు ప్రస్తుత అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి హిందువులందరినీ ఒక త్రాటిపైకి తెచ్చారని అట్టి మహోన్నతలు ఎల్కే అద్వానీ భారతరత్న అవార్డుకు యోగ్యుడు గా పేర్కొన్నారు. వీరికి అవార్డు ప్రకటించటం పట్ల ప్రకాశం జిల్లా బిజెపి తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అద్వానీని బిజేపి భీష్మ పితామహుడు గా శివారెడ్డి అభివర్ణించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *