తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం ప్రాథమిక పాఠశాల (ఏఏ) వద్ద ఆక్రమణలను మూడు రోజుల్లో తొలగిస్తామని పలువురు ఆక్రమణదారులు తెలిపారు. ఇక్కడి ఆక్రమణల గురించి కొందరు జిల్లా కలెక్టరు, తహసీల్దారు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టరు స్పందించి ఆక్రమ ణలను తొలగింపజేయాలని రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేశారు. మండలస్థాయి అధికారుల సూచనలతో కార్యదర్శి విచ్చేసి ఆక్రమణదారులతో మాట్లాడి తొలగించాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు చేపడతా మని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో తహసీల్దారు కే.వీ. ప్రసాదు సోమవారం మధ్యాహ్నం పాఠశాల వద్దకు విచ్చేసి ఆక్రమణలను పరిశీలించారు. ఆక్రమణదారులను పిలిపించి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అయితే మూడురోజుల్లో తామే తొల గింపజేస్తామని ఆక్రమణదారులు లిఖిత పూర్వకంగా పత్రాలు రాసి తహసీల్దారుకు అందజేశారు.


